HYD: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

by Disha Web Desk 2 |
HYD: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సింగర్ కోటితో కలిసి రాజ్ అనే చిత్రాలకు సంగీతం అందించారు. బంగారు బుల్లోడు, బావా బామ్మర్ది, మెకానిక్ అల్లుడు, పోకిరి రాజా, హలో బ్రదర్, త్రినేత్రుడు, బాల గోపాలుడు, యముడికి మొగుడు, తోడికోడళ్లు, రాజా విక్రమార్క, ది జెంటిల్ మెన్, కొదమసింహం, ఆస్తి మూరెడు ఆశ బారెడు, అక్క మొగుడు వంటి ప్రముఖ చిత్రాలకు రాజ్‌కోటిలు సంగీతం అందించారు. రాజ్ మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.

Next Story

Most Viewed