తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

by Disha Web Desk 7 |
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు ఫిలిం ఫెడరేషన్, మాజీ ప్రెసిడెంట్ కొమరం వెంకటేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ట్విట్టర్‌లో ప్రకటించింది. జూనియర్ ఆర్టిస్టుగా సినిమా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఫిలిం ఫెడరేషన్‌కు ప్రెసిడెంట్‌గా గెలుపొంది సేవాలందించారు. అంతే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా.. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చేరిన వెంకటేష్.. గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Next Story