ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు Hareesh Pengan కన్నుమూత

by Disha Web Desk 9 |
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు Hareesh Pengan కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు శరత్ బాబు మరణ వార్త మరవకముందే తాజాగా ప్రముఖ మళయాళ నటుడు హారీష్ పెంగన్ మరణించారు. కాలేయ సమస్యతో బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం 3. 25 గంటలకు ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. హారీష్‌కు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి అవసరమని చెప్పారు. దీంతో అతడి సోదరి అవయవ దానం చేయడానికి ముందుకొచ్చింది. కానీ శస్త్రచికిత్సకు రూ. 30 లక్షల ఖర్చు అవుతుందన్నారు. కుటుంబానికి అంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే స్తోమత లేకపోవడంతో ఆయన ఫ్రెండ్స్ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఆలోగా పెంగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

Read More... Bandla Ganesh: ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్

Next Story

Most Viewed