- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేశ్యగా మారిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. అందుకు కారణం ఇదేనంటూ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ వేశ్యగా మారబోతుంది.ఈ విషయం తెలుసుకున్న వారంతా అవాక్ అవుతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ వేశ్యగా మారబోతుంది.ఈ విషయం తెలుసుకున్న వారంతా అవాక్ అవుతున్నారు. కానీ అది నిజజీవితంలో కాదండీ.. ఓ సినిమాలో ఆ పాత్రలో కనిపిస్తుండటంతో అంతా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. వేశ్యగా నటించాలంటే అందంతో పాటు గట్స్ కూడా ఉండాలి. ఇలాంటి పాత్రలో నటించాలంటే ప్రేక్షకుల విమర్శలు కూడా భరించాల్సిందే. ఇక ఇలాంటి పాత్రలో నటించి ఎంతోమంది హీరోయిన్స్ ప్రశంసలు, విమర్శలు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ నటి బిందు మాధవి(Bindu Madhavi) కూడా వేశ్యగా మారబోతుంది. ‘అవకాయ బిర్యానీ’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాని, అల్లరి నరేష్ వంటి హీరోలతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్డమ్ సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని విన్నర్‌గా నిలిచింది.
ఇక ఇప్పుడు ‘దండోరా’ (Dandora)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా, లైక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో, పాత ఆచారాలు, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రం రూపొందుతోంది. అందులో శివాజీ(Shivaji), నవదీప్, నందు, మణిక, అనూష, రాధ్య, రవి కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిందు మాధవి వేశ్యగా కనిపించనుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అసలు ఆ పాత్ర చేయడానికి కారణాలను వెల్లడించింది. ‘‘నాకు ఈ పాత్ర వచ్చినప్పుడు మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్‌గానే అనిపించింది.
ఒకరోజు మా డైరెక్టర్ కథ చెప్పడానికి వచ్చారు. అప్పటికే సినిమా సగం పూర్తి అయిందని చెప్పారు. మొదట్లో సగం మూవీ అయిపోయిందిగా... నా పాత్ర చిన్నదిగా ఉండొచ్చు అనుకుని రిజెక్ట్ చేయాలనిపించింది. కానీ కథ ఒక్కసారి వినేద్దాం అనుకున్నా. అది విన్న తర్వాతే నా నిర్ణయం పూర్తిగా మారిపోయింది. డైరెక్టర్ కథ చెబుతూనే... కొన్ని ఎమోషన్స్ వెంటనే కళ్ల ముందుకి వచ్చాయి. నా ఎంట్రీతో సినిమా మొత్తం టర్న్ అయ్యేలా ఈ పాత్ర ఉందని అప్పుడు అర్థమైంది. ఆ క్షణంలోనే ఈ పాత్ర నాదే అని ఫిక్స్ అయ్యాను. అందుకే వేశ్యగా చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.






