నటుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. దండలతో దర్శనమివ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-08 10:24:31  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బ్యూటిఫుల్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

నటుడిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. దండలతో దర్శనమివ్వడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ బ్యూటిఫుల్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఈషా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అనతి కాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ అమ్మడు ఓ నటుడిని పెళ్లి చేసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. దండలతో దర్శనమిచ్చిన ఆమె పెట్టిన ఫొటోను సడెన్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు కంగ్రాట్స్ చెబుతున్నారు.

అయితే ఆమె నిజంగా పెళ్లి చేసుకోలేదు. అది ఓ సినిమా పోస్టర్ అని తెలుస్తోంది. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతి’. తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) హీరోగా నటిస్తుండగా.. ఏఆర్ సంజీవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, జయంక్రిష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీనిని ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.

ఈనేపథ్యంలో.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను ఈషా రెబ్బా షేర్ చేసింది. ఇక ఇందులో ఎరుపు రంగు పట్టుచీర ధరించిన ఆమె తలలో మల్లెపూలు పెట్టుకుని సంప్రదాయ లుక్‌లో ఉండగా.. చేతిలో దండ పట్టుకుని కనిపించింది. ఇక ఆమె పక్కన తెలుపు రంగు పంచె, షర్ట్ ధరించి తరుణ్ భాస్కర్ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ పోస్ట్‌కు ఈషా రెబ్బా ‘‘త్వరలోనే నవ్వుల విందుకు ముహూర్తం కాయం చేద్దాం’’ అనే క్యాప్షన్ జత చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story