పవన్ కళ్యాణ్‌కు తమ్ముడిగా టాలీవుడ్ యంగ్ హీరో.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-10 05:25:38  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి(Surender Reddy)తో ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్‌కు తమ్ముడిగా టాలీవుడ్ యంగ్ హీరో.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి(Surender Reddy)తో ఒక భారీ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో ఒక అదిరిపోయే వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక పవర్ ఫుల్ రోల్ చేయబోతున్నాడట. కేవలం గెస్ట్ రోల్ మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్‌కు తమ్ముడిగా విజయ్ కనిపిస్తారనే ప్రచారం మెగా , రౌడీ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తోంది. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం.

సురేందర్ రెడ్డి సినిమాల్లో హీరోలకు ఉండే స్టైలిష్ లుక్స్, ఎలివేషన్లు మామూలుగా ఉండవు, అలాంటిది ఇద్దరు మాస్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇరు వర్గాల అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.కానీ, విజయ్ దేవరకొండ ప్రస్తుత బిజీ షెడ్యూల్ చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కొంచెం కష్టమే అనిపిస్తోంది. విజయ్ ఇప్పటికే ‘రౌడీ జనార్దన’, ‘రణబాలి’ వంటి భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస షూటింగ్స్ కారణంగా ఆయన పవన్ సినిమాకు కాల్షీట్లు ఇవ్వడం దాదాపు అసాధ్యమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ క్రేజీ రూమర్ నిజమవుతుందో లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే వరకు ఆగాల్సిందే.

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లిపై తరుణ్ భాస్కర్ రియాక్షన్ ఇదే!

Next Story