గద్దర్ అవార్డుల ప్రకటనపై స్పందించిన టాలీవుడ్ రచయిత.. తెలంగాణ ప్రభుత్వం తీరుపై సెటైరికల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-31 12:17:37  IST  )

14 ఏళ్ల తర్వాత కళా రంగంలోని నటీనటుల ప్రతిభకు గద్దర్ పురస్కారాలతో గౌరవం దక్కింది.

గద్దర్ అవార్డుల ప్రకటనపై స్పందించిన టాలీవుడ్ రచయిత.. తెలంగాణ ప్రభుత్వం తీరుపై సెటైరికల్ ట్వీట్
X

దిశ, సినిమా: 14 ఏళ్ల తర్వాత కళా రంగంలోని నటీనటుల ప్రతిభకు గద్దర్ పురస్కారాలతో గౌరవం దక్కింది. అయితే ఈ అవార్డులను జయసుధ(Jayasudha), తెలంగాణ ఫిలిం కార్పోరేషన్ చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju)తో కలిసి అవార్డుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో 2014 నుంచి 202 వరకు ఒక్కో సంవత్సరానికి గారు ఉత్తమ చలన చిత్రాలకు గద్దర్ అవార్డులను ప్రకటించగా.. పలువురికి ఈ గౌరవం దక్కింది. ఇక గత రెండు రోజుల నుంచి ఈ వేడుకకు సంబంధించిన పోస్టులే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవార్డులు వచ్చిన వారికి నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరికొందరు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. గద్దర్ అవార్డుల ప్రకటనపై ఇప్పటికే నటుడు బండి సరోజ్ కుమార్(Bandi Saroj Kumar) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఇప్పుడు టాలీవుడ్ మాటల రచయిత అబ్బూరి రవి(Abburi Ravi) ట్విట్టర్ ద్వారా గద్దర్ అవార్డు ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై సెటైరికల్ ట్వీట్ చేయడంతో అది కాస్త చర్చనీయాంశంగా మారింది. ‘‘సుబ్రహ్మణ్యం ఇది గమనించావా.. మాటల రచయిత గుర్తింపు ఇవ్వాల్సిన రచయిత కాదట.. పెద్దలు తేల్చేశారు.

ఇన్నాళ్లూ ఆ మాటలే కథని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా.. గుండెకు హత్తుకునేలా చేస్తాయి అని నాతో వాదించావు కదా.. ఇప్పటికైనా అర్థం అయిందా నీకు’’ అని రాసుకొచ్చారు.ఇక ఈ ట్వీట్‌ను కొన్ని నిమిషాల్లోనే డిలీజ్ చేశారు. అయినప్పటికీ నెటిజన్లు స్క్రీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఆయన మరో పోస్ట్‌లో ‘‘ఎందుకులే సుబ్రహ్మణం ఇవన్నీ మనకు.. ప్రశాంతంగా పని చేసుకుందాం’’ అని పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అంటే పెద్దలు నటీనటులకు, సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చారని..రచయితలను గుర్తించలేదని అబ్బూరి రవి ఇండైరెక్ట్‌గా ఇలాంటి పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది.

Next Story