- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొట్టోడు అంటూ రామ్ చరణ్‌ను అవమానించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్?
మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న చెర్రీ, మగధీర సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక

దిశ, వెబ్‌డెస్క్ : మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న చెర్రీ, మగధీర సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ కెరీర్ ఆయన ఊహించని విధంగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన కాజల్ కూడా మంచి ఫేమ్ సంపాదించుకొని, స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది.
ఇక ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్‌ని పొట్టోడా అంటూ అవమానించిందంట. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనుష్క గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోద్ది ఈ ముద్దుగుమ్మ. అయితే రామ్ చరణ్ రెండో సినిమా మగధీరలో మిత్రవింద పాత్రలో మొదటగా రాజమౌళి, అనుష్కను అనుకున్నారట. తనను ఆ పాత్ర చేయమని అడిగాడంట. దానికి స్వీటి శెట్టి సమాధానం ఇస్తూ..రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడని,ఆ సినిమాలో హీరో హీరోయిన్ గా చేస్తే మేమిద్దరం అక్కా తమ్ముడులాగా కనిపిస్తామని, ఆ సినిమా బాగుండదు అంటూ చెప్పడంతో రాజమౌళి అనుష్కని రిజెక్ట్ చేసి కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట.దీంతో రామ్ చరణ్ అభిమానులు అనుష్కపై మండిపడుతున్నారు. మా అభిమాన హీరోను పొట్టోడా అంటవా అని తిట్టిపోస్తున్నారు.
Read more:
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. పవన్ కళ్యాణ్ ట్వీట్ వైరల్
మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఫస్ట్‌లుక్ పోస్టర్ రీలీజ్






