- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్ప మనసు చాటుకున్న త్రిష.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘వర్షం’(varsham) సినిమాతో వచ్చి విలక్షణమైన నటనతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. 42 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా తన అందంతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. యంగ్ హీరోలతోనూ కాకుండా సినియర్స్‌తోనూ నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తోంది. ఇక ఇటీవల త్రిష కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) రొమాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ‘థగ్‌లైఫ్’ మూవీ బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’(Vishvambhara) సినిమాలో నటిస్తోంది. అలాగే కోలీవుడ్ లోనూ మరో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ త్రిష మాత్రం సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలను షేర్ చేయడమే కాకుండా అభిమానులతో చిట్ చాట్ చేస్తోంది. అంతేకాకుండా త్రిష తనవంతు సాయం కూడా చేస్తూ నెటిజన్ల చేత ప్రశంసలు కూడా అందుకుంటుంది.
అసలు విషయంలోకి వెళితే.. చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుప్పుకొట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వ వినాయకర్ ఆలయానికి గజ అనే యాంత్రిక ఏనుగును త్రిష బహుకరించింది. అయితే ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహురించడం తమిళనాడులో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ త్రిష ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు త్రిషపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే అరుదైన రికార్డ్ సాధించిందని అంటున్నారు.






