- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవితేజ ‘RT-77’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అదృష్టం కలిసొచ్చేనా?
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ గత కొద్ది రోజులుగా ఒక్క హిట్ కూడా రాలేదు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ గత కొద్ది రోజులుగా ఒక్క హిట్ కూడా రాలేదు. ఇటీవల ‘మాస్ జాతర’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ మూవీతో పాటు రవితేజ మరొ ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యారు. ఈ చిత్రం ‘RT-77’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతుండగా.. శివ నిర్వాణ (Shiva Nirvana)దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చే నెల మొదలు కాబోతుండగా... అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ చిత్రంతో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత(Samantha) ‘RT-77’సినిమాలో నటిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు సంతోషం వ్యక్తి చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సామ్ ఇందులో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే పలు డిజాస్టర్లతో సతమత మవుతున్న రవితేజకు ఈసారైనా అదృష్టం కలిసొస్తుందో లేదో చూడాలి. సమంత ఉంది కాబట్టి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






