ఊహించని కాంబో ఫిక్స్..‘మెగా-158’లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హాట్ టాపిక్‌‌గా మారిన న్యూస్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయిన సంగతి తెలిసిందే.

ఊహించని కాంబో ఫిక్స్..‘మెగా-158’లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హాట్ టాపిక్‌‌గా మారిన న్యూస్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) కొద్ది కాలం పాటు ఇండస్ట్రీకి దూరం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ‘ఘాటి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. స్క్రిప్టులు వింటున్న ఆమె ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు టాక్. ‘మెగా-158’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఓ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. అనుష్క శెట్టిని మూవీ టీమ్ సంప్రదించగా.. స్టోరీ నచ్చడంతో ఆమె కూడా ఒప్పుకున్నట్లు టాక్. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) డైరెక్టర్ బాబీ(Bobby) కాంబోలో రాబోతుంది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనుందంటూ పలు వార్తలు వస్తున్నాయి. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించిన అనుష్మ మెగాస్టార్‌తో నటించలేదు.

ఇక ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుండటంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు వీరి కెమెస్ట్రీని చూసేందుకు ఆతృతగా ఉన్నారు. ఈ చిత్రం దసరాకి సెట్స్ మీదకి వెళ్లనుంది. హిట్ కాంబో కావడంతో ఈ మూవీపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో విలన్‌గా మంచు మనోజ్‌ని తీసుకోనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెట్టింట సంచలనం సృష్టిస్తుందనడంతో అతిశయోక్తి లేదు. ఇక నిజంగానే వీరిద్దరి కాంబో ఫిక్స్ అయితే మాత్రం అభిమానులకే పండగే అనిచెప్పవచ్చు.

Next Story