విడాకులు కన్ఫర్మ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-05 07:08:53  IST  )

హన్సిక (Hansika Motwani)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

విడాకులు కన్ఫర్మ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హాట్ టాపిక్‌గా మారిన వ్యవహారం!
X

దిశ, సినిమా: హన్సిక (Hansika Motwani)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ‘దేశముదురు’ (Desamuduru)సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రభాస్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, గోపీచంద్, ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తెలుగుతో పాటు హన్సిక తమిళ, హిందీ వంటి భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ కనిపించింది. చివరగా హన్సిక 105 మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘శ్రీ గాంధారి’ (Sri Gandhari)చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆర్, కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా.. ఇందులో హన్సిక హిందూ ట్రస్ట్ కమిటీ హెడ్ ఆఫీసర్‌గా కనిపించనుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. వరుస సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే హన్సిక తన ప్రియుడు సోహైల్‌(Sohail)ను 2022లో పెళ్లాడింది. అంతేకాకుండా ‘లవ్ షాదీ డ్రామా’ పేరుతో ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను కూడా విడుదల చేసింది. ఓ వైపు సినీ కెరీర్‌లో బిజీగా ఉంటూనే పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే.. హన్సిక తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు పలు వార్తలు వచ్చాయి. ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో గత కొద్ది కాలంగా వీరిద్దరు దూరంగా ఉంటున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిపై సోహైల్ స్పందించినప్పటికీ హన్సిక మాత్రం రియాక్ట్ కాలేదు. దీంతో విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. తాజాగా, హన్సిక విడాకులు కన్ఫర్మ్ చేస్తూ పెళ్లి ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి డిలీట్ చేసింది. ఈ విషయం కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు గత కొద్ది కాలంగా విడాకులను అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం సైలెంట్‌గా పార్ట్‌నర్‌కు దూరం అవుతున్నారు. సీక్రెట్‌గా విడాకులు తీసుకుంటున్నారు. తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పెళ్లి ఫొటోలను డిలీట్ చేస్తున్నారు. పలు వార్తలు వైరల్ కావడంతో విడాకులు తీసుకున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక హన్సిక కూడా ఇదే ఫాలో అవుతూ పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది.

Next Story