యాంకర్ అందానికి ఫిదా అయిపోయిన ఐకాన్ స్టార్.. ఆయన కామెంట్‌తో భూమి మీద ఆగలేకపోతున్నానంటూ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanti Chokkarapu) అందరికీ సుపరిచితమే.

యాంకర్ అందానికి ఫిదా అయిపోయిన ఐకాన్ స్టార్.. ఆయన కామెంట్‌తో భూమి మీద ఆగలేకపోతున్నానంటూ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్ స్రవంతి చొక్కారపు(Sravanti Chokkarapu ) అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోల్లో పాల్గొన తన మాటలతో అందరినీ ఫిదా అయ్యేలా చేసి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమా ఈవెంట్లకు కూడా వర్క్ చేసి తన అందంతో స్టేజ్‌పై రచ్చ చేస్తుంటుంది. కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. యాంకర్‌గా రాణిస్తున్న స్రవంతి ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫొటోలను మాత్రం నెట్టింట పెడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల వేడుకకు హాజరైంది.

అయితే ఇందులో గ్రీన్ కలర్ చీరలో హాజరైన ఆమె అందాన్ని ఓ టాలీవుడ్ స్టార్ హీరో ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని చెప్తూ స్రవంతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సరసన నిల్చొని ఫొటో దిగింది. ఈ సమయంలోనే ఆయన కిందనుంచి మీదకు చూసి చీర చాలా బాగుంది అందంగా ఉన్నారని అన్నారు. ఇక ఈ వీడియోకు స్రవంతి ‘‘మనం ఎంతగానో ఇష్టపడే హీరో,మనం కట్టుకున్న చీర చాలా బాగుంది,చాలా అందంగా ఉన్నారు అంటే ఇక భూమి మీద ఆగగలమా’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు నిజంగాను నువ్వు బాగున్నావ్ అని కామెంట్లు పెడుతున్నారు.

instagram link

Next Story