- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్పిరిట్’ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో .. సంచలనంగా మారిన పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెలతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే మెగాస్టార్ ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరు షూట్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, మెగాస్టార్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. చిరు ఓ పాన్ ఇండియా హీరో సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit)మూవీలో మెగాస్టార్ ప్రభాస్‌కు తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం ఇప్పటికే డేట్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో ఫాదర్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా చిరు పాత్రకు ఉండబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో అది చూసిన ప్రేక్షకుల్లో చిరు పాత్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






