టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పనికి మాలిన వాడంటూ.. హీరోయిన్ సంచలన పోస్ట్

by Disha Web Desk 6 |
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పనికి మాలిన వాడంటూ.. హీరోయిన్ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ నిత్యం పలు వివాదాస్పద పోస్టులతో నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. ఒకప్పుడు పలు సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైంది. అయినప్పటికీ ఆమె వేసే వివాదాస్పద ట్వీట్లు చర్చలకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా ఆమె పవన్ కల్యాణ్, త్రివిక్రమ్‌లపై సంచలన పోస్టులు పెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది.

పూనమ్ ఏ పోస్ట్ పెట్టిన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతుంది. కొన్ని సార్లు ఆమె ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తనకు నచ్చిన మాటలు అంటూ రచ్చ చేస్తుంది. అయితే పవన్, త్రివిక్రమ్‌లతో పూనమ్’కు ఉన్న గొడవ ఏంటో ఇప్పటి వరకూ తెలియనప్పటికీ ఇంత వరకు వాళ్ల పేర్లు చెప్పకుండానే పోస్టులు పెట్టిన ఆమె ఇప్పుడు పేరు పెట్టి మరీ పోస్ట్ పెట్టడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే.. పవన్ రాజకీయ ప్రసంగం లో భాగంగా త్రివిక్రమ్ గురించి ప్రస్తావించి అత్తారింటికి దారేది డైలాగ్ చెప్పాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. దానికి పూనమ్ ‘‘త్రివిక్రమ్ పనికి మాలిన వాడని’’ట్వీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ పోస్టును చూసిన వారంతా షాక్ అవుతున్నారు.

Next Story