Tollywood: పాన్ ఇండియా రేంజ్ నిలబెట్టుకోవాలంటే .. హిట్ పడాల్సిందే మామ!

by Disha Web Desk 10 |
Tollywood: పాన్ ఇండియా రేంజ్ నిలబెట్టుకోవాలంటే .. హిట్ పడాల్సిందే మామ!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమంటే ఒక వ్యాపారం. ఇక్కడ సినిమా హిట్టు పడితేనే హీరో.. లేదంటే జీరో అవ్వడం పక్కా. టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్. రాధే శ్యామ్, సాహో సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కెరియర్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఆదిపురుష్, సలార్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే ప్రభాస్ తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను కొనసాగించగలడు.. సినిమా ఫట్టు అయితే టాలీవుడ్లోనే పరిమితం కావాలిసి ఉంటుంది. అతి త్వరలో మన ముందుకు రానున్న ఆదిపురుష్, సలార్ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హాలీవుడ్లో కూడా అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ చేయబోయే కొత్త సినిమాల పై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ నిలబెట్టుకోవాంటే .. హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022 లో సర్కారు వారి పాటతో వచ్చిన మహేష్ బాబుకు, ఈ సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మహేష్ బాబుకు అర్జెంటుగా హిట్ పడాలి. ఈ టఫ్ వార్లో ఎంత మంది స్టార్ హీరోలు వారి పాన్ ఇండియా రేంజ్ నిలబెట్టుకుంటారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి :

Pathaan Movie: "పఠాన్" కు అంత సీను లేదంటున్న బాహుబలి టీం

Next Story

Most Viewed