ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు.. వారంలో అంతా మారిపోయిందంటూ టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మౌళి(Moulee) ‘90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ’ సిరీస్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts)సినిమాతో హీరోగా మారాడు.

ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు.. వారంలో అంతా మారిపోయిందంటూ టాలీవుడ్ హీరో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మౌళి(Moulee) ‘90స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ’ సిరీస్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts)సినిమాతో హీరోగా మారాడు. డైరెక్టర్ సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శివాని నాగరం హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ‘లిటిల్‌ హార్ట్స్‌’ తో హీరోగా ప్రేక్షకులను పలకరించిన మౌళి బిగ్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తూనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మొదటి మూవీ ఘన విజయం సాధించడంతో ఆయన రేంజ్ మారిపోయింది. పలువురు స్టార్ హీరోలు ప్రశంసలు పొందుతున్నాడు. తాజాగా, ‘లిటిల్ హార్ట్స్’ మూవీ మేకర్స్‌ను విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తన ఇంటికి ఇన్వైట్ చేసి మరీ అభినందించాడు.

హీరో మౌళి తనూజ్, కమెడియన్ జయకృష్ణ, డైరెక్టర్ సాయి మార్తాండ్, డీవోపీ సూర్య బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఇతర టీమ్ మెంబర్స్ వెళ్లారు. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ మౌళి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘సోదరుడిలా విజయ్ దేవరకొండ మాపై చూపించిన ప్రేమ, ఆయన చెప్పిన మాటల్ని ఎప్పటికీ మర్చిపోలేము. వారంలో అంతా మారిపోయింది. విజయ్ దేవరకొండ అన్న పర్సనల్ గా నాకు స్టైలింగ్ చేస్తాడని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. లవ్ యు అన్నా. 'లిటిల్‌ హార్ట్స్‌' సినిమాకి సపోర్ట్ చేసిందనుకు ధన్యవాదాలు. ‘రౌడీ’ అవుట్ ఫిట్స్ మాకు బాగా నచ్చాయి’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ వీడియోను కూడా షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Next Story