ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్?

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అందాల తార చేసింది

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ( Varsha Bollamma ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అందాల తార చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ.. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ వర్ష బొల్లమ్మ.. 2015 సంవత్సరంలో సుతరన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ.. 2020 సంవత్సరంలో చూసి చూడంగానే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, స్వాతిముత్యం, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు చేసింది. లేటెస్ట్ గా నితిన్ సరసన తమ్ముడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది హీరోయిన్ వర్ష. ఇక హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో హీరోయిన్ వర్ష బొల్లమ్మ మరోసారి నిరాశ ఎదురయింది. ఇది ఇలా ఉండగా... హీరోయిన్ వర్ష గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తుందని.. బెంగళూరులోని ఓ ఏరియాలో ఈ షాప్ ఓపెన్ చేసిందని కొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఆమె ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టలేదు. ఆమె ఫ్రెండ్... ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను కొత్తగా స్టార్ట్ చేశారు. మై ఫ్రెండ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్... పేరుతో ఆ దుకాణాన్ని ప్రారంభించారు. అయితే ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది హీరోయిన్ వర్ష. ఇది చూసిన నెటిజెన్స్... ఆమెనే ఈ బిజినెస్ ప్రారంభించినట్లు సెటైర్లు పేల్చుతున్నారు.

Next Story