అభిమానులకు బిగ్ షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ కేతిక శర్మ(Ketika Sharma) మోడలింగ్‌లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అభిమానులకు బిగ్ షాకిచ్చిన టాలీవుడ్  హీరోయిన్.. చర్చనీయాంశంగా మారిన ఇన్‌స్టా పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కేతిక శర్మ(Ketika Sharma) మోడలింగ్‌లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో ‘రొమాంటిక్’(Romantic) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో నటించి ఫుల్ క్రేజం సంపాదించుకుంది. అలా తెలుగులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam tej) కాంబోలో వచ్చిన ‘బ్రో’లోనూ కనిపించింది. కానీ పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. ఇక ఇటీవల ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యం పలు హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అమ్మడు ఫుల్ ఫామ్‌లో ఉంది. రోజుకో ఫొటోషూట్ అయినా చేస్తూ కుర్రాళ్లలో హీట్ పుట్టిస్తోంది. తన బాడీ పార్ట్స్ చూపిస్తూ కూల్ వెదర్‌లో చెమటలు పట్టేలా చేస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు బిగ్ షాకిచ్చింది. సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు తెలుపుతూ ఓ ఫొటోను కూడా షేర్ చేసింది. అలాగే అదే పిక్‌కు త్వరలోనే వస్తానంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నిరాశ చెందుతున్నారు. అలాగే అసలు కేతికకు ఏమైంది. ఇంత సడెన్‌గా ఎందుకు బ్రేక్ తీసుకుంటుందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story