సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో.. భార్య వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో అదిత్ అరుణ్(Adith Arun) అలియాస్ త్రిగుణ్ 2009లో ‘కథ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

సడెన్ షాకిచ్చిన టాలీవుడ్ హీరో.. భార్య వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అదిత్ అరుణ్(Adith Arun) అలియాస్ త్రిగుణ్ 2009లో ‘కథ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించి మెప్పించాడు. అలాగే ఆర్జీవీ తెరకెక్కించి కొండా చిత్రంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. గత ఏడాది ‘ఉద్వేగం’(Udvegam) సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. త్రిగుణ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. వరుస చిత్రాలతో కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే ఆయన 2023లో నివేదిత(niveditha) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తిరుపురులో జరిగిన వీరి వివాహ వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. పెళ్లైన రెండేళ్లకు తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా, త్రిగుణ్ తమ పెళ్లి వార్షకోత్సవం నాడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ‘‘మూడు హృదయాలు.. రెండు సంవత్సరాలు.. ఒక కుటుంబం కాబోతుంది. సెప్టెంబర్ 24న మేము తల్లిదండ్రులు కాబోతున్నాము. నాకు బాబు పుట్టాలని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. అలాగే భార్య సీమంతం వీడియోను షేర్ చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story