మా ప్రయాణం త్వరలో ప్రారంభమవుతుందంటూ కీలక ప్రకటన చేసిన టాలీవుడ్ హీరో.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు.

మా ప్రయాణం త్వరలో ప్రారంభమవుతుందంటూ కీలక ప్రకటన చేసిన టాలీవుడ్ హీరో.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర(Naveen Chandra) ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. గత కొద్ది కాలంగా వరుస చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ సాధించలేకపోతున్నాడు. ఇటీవల లెవన్, 28 డిగ్రీల సెల్పియస్, షో టైమ్ వంటి మూవీలతో ప్రేక్షులను అలరించిన ఆయన హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. తాజాగా, నవీన్ చంద్ర ట్విట్టర్ ద్వారా కొత్త సినిమాను ప్రకటించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ ‘హనీ’ (honey) మూవీతో రాబోతున్నట్లు వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశానని తెలిపాడు.

‘‘ఈ సంవత్సరంలో రాబోతున్న అత్యంత హృదయ విదారకమైన, శక్తివంతమైన సినిమా ఇప్పుడు పోస్ట్-ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. తన ఆలోచనాత్మక విధానంతో దర్శకుడు కరుణకుమార్ డబ్బింగ్ ప్రారంభించారు. ‘హనీ’ ప్రయాణానికి లోతైన భావోద్వేగ పొరను జోడించారు. మేము ఆకర్షణీయమైన కంటెంట్‌తో ప్రమోషన్‌లను ప్రారంభిస్తున్నాము. మా ప్రయాణం త్వరలో ప్రారంభమవుతుంది’’ అని రాసుకొచ్చాడు. అయితే ఈ మూవీకి కరుణ కుమార్(Karuna Kumar) దర్శకత్వం వహిస్తుండగా.. శేఖర్ స్టూడియో బ్యానర్‌పై రవి పీట్లతో కలిసి శేఖర్ మాస్టర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దివ్య పిళ్లై(Divya Pillai), దివి, రాజా రవీంద్ర, కల్యాణి మాలిక్, బేబీ జయని కీలక పాత్రలో కనిపించబోతున్నారు.ఇక ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు.

link

Next Story