- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృణాల్ ఠాకూర్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ హీరో.. వైరల్‌గా మారిన వీడియో
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) సీరియల్స్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘సీతారామం’ (Sita Ramam)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. మొదటి చిత్రంతో ఊహించని విధంగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. త్వరలో ‘సర్దార్-2’(Sardar-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు తెలుగు అడివి శేష్ సరసన ‘డెకాయిట్’(Dacoit) మూవీలో నటిస్తోంది. షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్‌కు టాలీవుడ్ హీరో అడివి శేష్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. డెకాయిట్ షూటింగ్‌లో ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేశాడు. మృణాల్‌కు తెలియకుండా మూవీ టీమ్ అంతా ఆమెను షాక్‌కు గురయ్యేలా చేశారు. ఆమె పుట్టిన రోజు ఆగస్టు 1న అయినప్పటికీ ముందే ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. కేక్‌ను చూసిన ఈ భామ తనకు తెలియకుండా ఎలా చేశారంటూ ఆశ్చర్యపోయింది. అలాగే కేక్ కట్ చేస్తున్న సమయంలో అడివి శేష్‌ను కూడా తనతో పాటు కట్ చేయాలని అంటుంది. కానీ ఆయన దూరం జరగ్గా కేక్ కట్ చేసి పెడుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






