ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఎప్పుడంటే?

by Mallepaka Hamsa |

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్(Narne Nitiin) అందరికీ సుపరిచితమే.

ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న ఎన్టీఆర్ బామ్మర్ది.. ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్(Narne Nitiin) అందరికీ సుపరిచితమే. ‘మ్యాడ్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆయ్, మ్యాడ్-2 (Mad-2)వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. వరుస విజయాలతో పాపులారిటినీ పెంచుకున్న ఆయన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’తో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నార్నే నితిన్ విభిన్న కథలు సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్‌ విషయానికొస్తే.. గత ఏడాది నవంబర్‌లో శివాని అనే అమ్మాయితో ఘనంగా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

ఎంగేజ్‌మెంట్ జరిగిన ఏడాది పూర్తి కావొస్తున్నా నార్నే నితిన్ పెళ్లి డేట్ ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. తాజాగా, నార్నే నితిన్-శివాని(Shivani) పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు అక్టోబర్ 10న ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా.. ఎన్టీఆర్, ప్రణతి ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తోంది. ఇక నార్నే నితిన్‌కు కాబోయే భార్య రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి అని.. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ కుటుంబానికి సమీప బంధువులని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నార్నే నితిన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story