- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి అయిన టాలీవుడ్ హీరో పోస్ట్ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
టాలీవుడ్ హీరో తిరువీర్(Thiruveer) తండ్రి అయ్యాడు. ఆయన భార్య డిసెంబర్ 12న ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో తిరువీర్(Thiruveer) తండ్రి అయ్యాడు. ఆయన భార్య డిసెంబర్ 12న ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. తిరువీర్ ట్విట్టర్ ద్వారా ఓ ఫొటో షేర్ చేశాడు. ఇందులో తన కొడుకు చేతిని పట్టుకుని ఉండగా.. నాయినొచ్చిండు అనే క్యాప్షన్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. గతేడాది కల్పన (kalpana)అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తిరువీర్ దంపతులు ఏడాదికే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తిరువీర్‌కు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. తిరువీర్ సినిమాల విషయానికొస్తే.. ‘మసూద’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.
ఘాజీ, మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, పరేషాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇటీవల ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో ప్రేక్షకులను అలరించినప్పటికీ హిట్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ సరసన నటించే చాన్స్ దక్కించుకుని ఫుల్ బిజీ అయిపోయాడు. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ కాంబోలో ‘ఓ సుకుమారి’ మూవీ రాబోతుంది. ఈ పాన్ ఇండియా సినిమాకు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుండగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






