హాలీవుడ్‌లోకి టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి.. సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుధీర్ఘ అనుభవం ఉన్న దర్శక, నిర్మాత సత్యారెడ్డి(Satya Reddy) అందరికీ సుపరిచితమే.

హాలీవుడ్‌లోకి టాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి.. సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుధీర్ఘ అనుభవం ఉన్న దర్శక, నిర్మాత సత్యారెడ్డి(Satya Reddy) అందరికీ సుపరిచితమే. ఆయన 55 చిత్రాలకు దర్శక, నిర్మాత, హీరో గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఓ వైపు దర్శక, నిర్మాతగా, నటుడిగా తన అభిరుచిని చాటుకుంటూనే నిర్మాతల మండలిలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా, సత్యారెడ్డి ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్ లోకి ప్రవేశిస్తున్నారు. ఇందులో భాగంగా పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఓ బ్యానర్ ను కూడా రిజస్టర్ చేశారు. హాలీవుడ్ స్థాయి లో నిర్మించే ఈ సినిమా కి అన్ని భాషల్లో ‘కింగ్ బుద్ధ’(King Buddha) అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు తెలిసింది. దాదాపు పాతికేళ్ల క్రితం ‘సర్దార్ చిన్నపరెడ్డి’(Sardar Chinnapareddy) చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించిన ఆయన

2016 లో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కూడా ఎన్నుకోబడ్డారు. ‘ఉక్కు సత్యాగ్రహం’ చిత్రకథలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టెక్నీకల్ సహాయం చేసిన రష్యన్లను కలిసే ముందు అప్పట్లో గద్దర్ ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన ప్రేరణతో బుద్ధిజం పైన హాలీవుడ్లో ఓసినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా సత్యారెడ్డి స్పందిస్తూ, ఈ తాజా చిత్రం షూటింగ్ లోకేషన్ల కోసం ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్ లాండ్, ,సింగపూర్, మలేషియా తదితర దేశాలు పర్యటించామని చెప్పారు. ప్రస్తుతం చిత్ర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, త్వరలో అమెరికా లో ప్రముఖుల సమక్షంలో చిత్ర పోస్టర్ లాంచ్‌తో పాటు పలు అప్డేట్స్ విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానని అన్నారు. అలాగే అన్ని వివరాలు ప్రకటిస్తానని తెలిపారు..

Next Story