- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సక్సెస్ లేకపోయినా తగ్గేదేలే.. ట్రోలర్ల నోళ్లు మూయించిన టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్!
గతంలో ఇలాంటి విషయాలు తనను ఎంతలా బాధించాయో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా అదృష్టం కలిసి రావడం లేదు. వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ, ఆమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ సరసన నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు శ్రీలీలను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనపై వస్తున్న ఈ విమర్శలు, నెగిటివిటీపై శ్రీలీల తాజాగా తనదైన శైలిలో స్పందించారు. గతంలో ఇలాంటి విషయాలు తనను ఎంతలా బాధించాయో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఈ ట్రోలింగ్ చూసి చాలా బాధపడేదాన్ని. ఒక్కోసారి తట్టుకోలేక చాలా ఏడ్చేదాన్ని కూడా.
అసలు ఇండస్ట్రీలో నేను కొనసాగగలనా? నా వల్ల అవుతుందా? అనే అనుమానంతో ఇక్కడి నుంచి వెళ్లిపోదామని కూడా అనుకున్నాను. అప్పుడు నేను చాలా సున్నిత మనస్కురాలిని" అని ఆమె తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు తను చాలా మారిపోయానని, ఇలాంటి విమర్శలను ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. "సోషల్ మీడియాలో ఏదైనా నెగిటివిటీ చూసినప్పుడు, అది ఫేక్ అని తెలుసుకునే వారు కూడా ఉన్నారు. కానీ నిరంతరం నెగిటివిటీని చూస్తూ ఉంటే, అది తెలియకుండానే మన సొంత ఆలోచనలను, మన వ్యక్తిత్వాన్ని కూడా మార్చేస్తుంది. అందుకే ఇప్పుడు నేను వాటిని పట్టించుకోవడం తగ్గించాను" అని శ్రీలీల స్పష్టం చేశారు. వరుస పరాజయాలు ఎదురవుతున్నా, తన నటన, డాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న ఈ బ్యూటీ, త్వరలోనే ఒక భారీ హిట్‌తో మళ్ళీ ఫామ్‌లోకి రావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.






