ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ కపుల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh), నటి వితికా షేరు(Vithika Sheru) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఎట్టకేలకు గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ కపుల్.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh), నటి వితికా షేరు(Vithika Sheru) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించి ఈక్రమంలోనే ప్రేమ పడి పెద్దలను కూడా ఒప్పించి ఒక్కటయ్యారు. ఇక ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ జంటగా పాల్గొన్నారు. వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక వితికా మాత్రం యూట్యూబ్ ఛానల్ నడుపుతూ పలు ఐడియాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఇక ఇటీవల వితికా తన భర్త పెట్టినరోజు సందర్భంగా ఓ ఇంటిని గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, వితికా, వరుణ్ సందేశ్ జంట ఓ గుడ్ న్యూస్ ప్రకటించారు.

వీరిద్దరు కలిసి తమ సొంత ఇంటి గృహ ప్రవేశం చేశారు. ఈ వేడుకలో పునర్నవి, శివ జ్యోతి, హిమజ, మెగా డాటర్ నిహారిక పాల్గొన్నారు. సెప్టెంబర్ 22న ఉదయం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టి పూజ, హోమం లాంటి కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీలతో కలిసి ఫొటోలు దిగారు. ఇక ఈ పిక్స్‌ను వితికా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. సొంత ఇల్లు ఉండాలనేది నా కల. అందుకే ఈ ఇంటి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూశాను. ఇన్ని రోజులు నా కల నెరవేరింది చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ జంటగా కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story