Pridhvi : కారు డ్రైవర్ మాట విని 100 ఎకరాలను పోగొట్టుకున్న టాలీవుడ్ నటుడు

by Disha Web Desk 7 |
Pridhvi : కారు డ్రైవర్ మాట విని 100 ఎకరాలను పోగొట్టుకున్న టాలీవుడ్ నటుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈటీవీలో ప్రసారం అయ్యే షోలలో ‘ఆలీతో సరదాగా’ ఒకటి. కమెడీయన్, సీనియర్ నటుడు ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి చాలా మంది ప్రముఖులు, నటీనటులు వచ్చి వారిలైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంటారు. ఈక్రమంలో ‘ఆలీతో సరదాగా’ షోకు వచ్చిన నటుడు పృధ్వీ ఒక డ్రైవర్ మాట విని తాను ఎలా 100 ఎకరాలు పోగొట్టుకున్నాడో తెలియజేశారు.

‘‘1997లో నాకు వచ్చిన డబ్బుతో బంజారాహిల్స్‌లో ఒక ఫ్లాట్ తీసుకుందామా..? శంషాబా‌ద్‌లో ప్రోపర్టీ తీసుకుందామా అని కంన్ఫుజన్‌లో ఉన్నాను. ఒక అతను వచ్చి.. చూడండి ఇక్కడ నుంచి మొత్తం 50 ఎకరాలు.. ఇటువైపు ఒక 50 ఎకరాలు మొత్తం 100 ఎకరాలు రూ. 10 లక్షలు అవుతోంది అన్నారు. అప్పుడు డ్రైవర్ వచ్చి పృధ్వీ సర్.. ఇది మీరు రూ.10 లక్షలు పెట్టి తీసుకున్న మరో రూ. 10 లక్షలు పెట్టి ఫెన్సింగ్ చేయించాలి మొత్తం రూ. 20 లక్షలు అవుతుంది అన్నాడు. దీంతో వద్దు అనుకుని వదిలేసి చిన్న ఫ్లాట్ తీసుకున్న. ఇప్పుడు ఆ 100 ఎకరాల్లోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. అంటే పృధ్వీ ఒక డ్రైవర్ మాట విని వందల కోట్ల విలువైన 100 ఎకరాలు పోగొట్టుకున్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఎస్పీ బాలుకు ఇచ్చిన మాట కోసం తేజ మూవీ ఒప్పుకున్నా : ఆర్. పి. పట్నాయక్

Next Story

Most Viewed