Aishwarya Rai Bachchan : నేడు విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ బర్త్‌డే

by Disha Web Desk 9 |
Aishwarya Rai Bachchan : నేడు విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ బర్త్‌డే
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆకర్షించే నీలికళ్లతో.. ఎంతో అనుభవమున్న శిల్పి చెక్కిన శిల్పంలా మెరిసిపోతూ ఉంటుంది. తన అందంతో ప్రపంచసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా.. ప్రాణమున్న పాలరాతి బొమ్మలా ఉంటుంది ఈ స్వప్నసుందరి. కాగా నేడు మిస్ వరల్డ్ 1994 పోటీ విజేత, అందానికి అర్థంగా కనిపించే ఐశ్వర్యరాయ్ రాయ్ పుట్టిన రోజు. ఈ రోజు ఐశ్వర్య తన 50 వ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

ఐశ్వర్య తమిళ, హిందీ, తెలుగు, బెంగాలీ మళయాళం భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఐశ్వర్య రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఈ బ్యూటీ కాలేజీలో ఉండగా.. కొన్ని మోడలింగ్ ఉద్యోగాలు కూడా చేశారు. మణిరత్నం దర్శకత్వంలో 1997 లో ‘ఇరువర్’ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఔర్ ప్యార్ హో గయా, జీన్స్, రోబో, విలన్, తెలుగులో రావోయి చందమామ, ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్‌లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.



Next Story

Most Viewed