- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దక్షిణ కాళీ’ సినిమాను తెరకెక్కించాలంటే డబ్బు కాదు ముఖ్యం దమ్ము కావాలి..
నిధి క్రియేషన్స్ పతాకంపై అర్చన అమ్మ వారిగా ప్రధాన పాత్రలో చంద్రగిరి సుబ్బు, ప్రియాంక శ్రీ, చంద్రకళ, ఆఫ్జాద్ అజాద్ నటీనటులుగా ..

దిశ, సినిమా: శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై అర్చన అమ్మ వారిగా ప్రధాన పాత్రలో చంద్రగిరి సుబ్బు, ప్రియాంక శ్రీ, చంద్రకళ, ఆఫ్జాద్ అజాద్ నటీనటులుగా తోట కృష్ణ దర్శకత్వంలో మీసాల వాణిగారు (meesala vani)నిర్మిస్తున్న చిత్రం ‘దక్షిణ కాళీ’(Dakshina Kali). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర టైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ రాజా(Shivaji Raja), ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఈసీ మెంబర్ పద్మిని గారు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర టైలర్‌ను లాంచ్ చేశారు. నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ఎంత దమ్ముంటే ఒక లేడీ ఈ సినిమా తీస్తారండి. డబ్బు కాదు ముఖ్యం దమ్ము కావాలి. ఆ కాళీమాతే ఆవిడని ఆవహించి ఈ సినిమా తీసిందేమో అన్నట్టుంది ఈ సినిమా ట్రైలర్.
అలాగే ఇందులో నటించిన అర్చన అద్భుతంగా నటించింది. హీరో హీరోయిన్స్ చక్కటి నటనను ప్రదర్శించారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ డైరెక్టర్ కృష్ణ గారికి, నిర్మాత మీసాల వాణిగారికి ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. అనంతరం.. చిత్ర నిర్మాత మీసాల వాణిగారు మాట్లాడుతూ.. అమ్మవారి సబ్జెక్టు అయిన దక్షిణ కాళీ కథను నేనే రాసుకొని సినిమా తీయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఈరోజు స్టేజి మీద నిలుచున్నాను అంటే అంతా ఆ తల్లి దయే.. ప్రతిక్షణం, ఏం చేసినా అమ్మవారి దయతోనే చేశాను. మా మూవీ టీం, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తున్న సహకారం మరువలేనిది’’ అని చెప్పింది






