- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘అవకాశాలు రావాలంటే పక్కలోకి వెళ్లాల్సిందే’’.. సంచలన విషయాలు బయటపెట్టిన నటి
సినిమా ఇండస్ట్రీలోని చీకటి నిజాలు సినిమాల్లో రాణించాలని, పెద్ద నటి కావాలని కలలు కంటూ వచ్చే అమ్మాయిలకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెద్ద శాపంగా మారింది.

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలోని చీకటి నిజాలు సినిమాల్లో రాణించాలని, పెద్ద నటి కావాలని కలలు కంటూ వచ్చే అమ్మాయిలకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెద్ద శాపంగా మారింది. ఇప్పటికే చాలా మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టగా, తాజాగా మలయాళ నటి కని కుశృతి(Kani Kusruti ) చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. హీరోయిన్లను అవకాశాల పేరుతో ఎలా ట్రాప్ చేస్తారో, వారు ఎంత నీచానికి దిగజారుతారో ఆమె బయటపెట్టింది. కని కుశృతి అంటే మలయాళంలో మంచి గుర్తింపు ఉన్న నటి. 'బిర్యానీ' వంటి చిత్రాలతో అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. మన తెలుగులో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో కూడా ఆమె ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.
ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమెకు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తప్పలేదు. అది తనకు చాలా బాధ కలిగించిందని చెప్తూ.. ‘‘నేను మంచి నటిని కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇక్కడ ప్రతిభ కంటే కమిట్‌మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని అర్థమైంది. నాతో నేరుగా మాట్లాడటానికి భయపడే కొందరు మేకర్స్, ఏకంగా మా అమ్మ దగ్గరికి వెళ్లి అడిగేవారు. నీ కూతురు మాకు కమిట్‌మెంట్ ఇస్తేనే తనకి సినిమాలో ఛాన్స్ ఇస్తామని మొహం మీదే చెప్పేవారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. మనస్థాపంతో సినిమాలకు బ్రేక్ ఇలాంటి వేధింపులు భరించలేక కని కుశృతి చాలా సార్లు సినిమాలకు దూరంగా ఉంది. నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా, కేవలం శారీరక సుఖం కోసమే తనను చూస్తున్నారని ఆమె మనస్తాపం చెందింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడంతో, ఇష్టం లేకపోయినా మళ్ళీ నటన వైపు రావాల్సి వచ్చిందని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కని చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






