‘కూలీ’గా మారిపోయిన రజినీకాంత్.. వీడియో వైరల్

by Disha Web Desk 7 |
‘కూలీ’గా మారిపోయిన రజినీకాంత్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది ‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తన కూతురు ఐశ్వర్య తీసిన ‘లాల్ సలాం’ సినిమాలో నటించి మెప్పించిన ఆయన.. ప్రస్తుతం తన తదుపరి చిత్రమైన ‘Thalaivar171’తో బిజీగా ఉన్నాడు. ‘లియో’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. టైటిల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో రజినికాంత్ మాస్ లుక్‌లో ఆకట్టుకోవడంతో పాటు.. యాక్షన్ సీన్స్ ఇరగదీశారు. కాగా.. ఈ మూవీలో కింగ్ నాగార్జున సైతం ఓ కీలక పాత్రలో నటించున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ, దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

Read More...

వచ్చే ఏడాదే ది ఢిల్లీ ఫైల్స్ రిలీజ్.. బిగ్ అప్డేట్ చెప్పిన డైరెక్టర్

వచ్చే ఏడాదే ది ఢిల్లీ ఫైల్స్ రిలీజ్.. బిగ్ అప్డేట్ చెప్పిన డైరెక్టర్




Next Story