- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య-వెంకీ అట్లూరి సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసిన మేకర్స్
Suriya-46 సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు.

దిశ, సినిమా: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య(suriya) తన అభిమానులకు ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కెరీర్‌లో 46వ చిత్రంగా (Suriya 46) వస్తున్న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons) అనే క్లాసీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇందులో సూర్య ఒక పెద్ద భవనం ముందు నిలబడి, తన ముద్దుల కొడుకును క్యారీ బ్యాగ్‌లో వేసుకుని, చేతిలో పాల డబ్బా పట్టుకుని, స్టైలిష్ గ్లాసెస్ పెట్టుకుని నవ్వుతూ కనిపిస్తున్నారు. ఒక పక్కన సూర్య పవర్ ఫుల్ ఎనర్జీ, మరోపక్క హృదయాన్ని హత్తుకునే తండ్రీ కొడుకుల బంధం ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఆయన సమక్షంలో శక్తి.. ఆయన కౌగిలిలో వెచ్చదనం’’ అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే, సూర్య పాతకాలపు క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మాయాజాలాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నారని అర్థమవుతోంది. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈ ఏడాది టాలీవుడ్, కోలీవుడ్‌లో అతిపెద్ద ఫ్యామిలీ డ్రామాగా నిలిచే అవకాశం ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. ‘సార్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూర్యతో ఆయన చేస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు నటిస్తుండగా.. రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశీ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూలైలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






