కిచ్చా సుదీప్ ‘K-47’ సినిమాకు టైటిల్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో అంచనాలను పెంచేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-18 14:17:58  IST  )

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)గత ఏడాది ‘మ్యాక్స్’ సినిమాతో ప్రేక్షకులకు అలరించాడు.

కిచ్చా సుదీప్ ‘K-47’ సినిమాకు టైటిల్ ఫిక్స్.. పవర్ ఫుల్ పోస్టర్‌తో అంచనాలను పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)గత ఏడాది ‘మ్యాక్స్’ సినిమాతో ప్రేక్షకులకు అలరించాడు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయన ఓ భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. ఆయన కెరీర్‌లో 47వ చిత్రంగా తెరకెక్కుతుండగా.. విజయ్ కార్తీకేయ(Vijay Karthikeya) దర్శకత్వం వహిస్తున్నారు. ‘K-47’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీని సత్య జ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. నేడు కిచ్చా సుదీప్ పుట్టినరోజు కావడంతో మూవీ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. K-47కు ‘మార్క్’(MARK) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేస్తూ ఈ ఏడాది క్రిస్‌మస్ కానుకగా రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక గ్లింప్స్ చూసినట్లు అయితే ఫుల్ మాస్ యాక్షన్స్‌తో అంచనాలను పెంచుతోంది. లో ముందుగా పిచ్చి, అటిట్యూడ్, దయలేని రాజుగా కిచ్చా సుదీప్ నటిస్తున్నట్లు చూపించారు. అజయ్ మార్కండేయ్ పాత్రలో కనిపించబోతుండగా.. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది.

Next Story