- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రెగ్నెన్సీ వార్తలపై జయంరవి గర్ల్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్.. కర్మ వారిని వదిలిపెట్టదంటూ వార్నింగ్
కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) గత కొద్ది కాలంగా తన భార్య ఆర్తికి(aarti) విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో జయం రవి(Jayam Ravi) గత కొద్ది కాలంగా తన భార్య ఆర్తికి(aarti) విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి కేసు ఇంకా కోర్టులో కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సింగర్ కెనిషాతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి. వీరిద్దరు పలు ఫంక్షన్స్‌కు వెళ్లడంతో వీరి డేటింగ్‌కు సంబంధించిన వార్తలెన్నో వచ్చాయి. ఇక ఇటీవల వీరిద్దరు దండలు వేసుకుని కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా ప్రెగ్నెంట్ కూడా అయినట్లు పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, కెనిషా(Kenisha) ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది.
‘‘నేను గర్భవతిని అని కామెంట్ బాక్స్‌లో కూడా జనాలు కామెంట్ చేస్తున్నారు. గర్భిణీ బొడ్డు ఇలాగే ఉంటుందా? నేను గర్భవతిని కాదు.. నాకు అందమైన సిక్స్ ప్యాక్ మాత్రమే ఉంది. ఎవరు ఏమి చెప్పినా, ఇదంతా కర్మ రూపంలో వారికి తిరిగి వస్తుంది. నేనేం దేవదూతను కాదు. అలాగని దెయ్యాన్ని కూడా కాదు. సోషల్ మీడియాలో నాపై ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటికి నేను కూడా సమాధానం చెప్పగలను కానీ నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. నిజాలు, అబద్ధాలు అతి త్వరలోనే తెలుస్తాయి. అప్పటివరకు అందరూ ఇంట్లో బిర్యానీ తయారు చేసుకోండి, ప్రశాంతంగా తినండి, నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






