- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫస్ట్ బ్రీజ్‌కు రంగం సిద్ధం.. ‘గోదారి గట్టుపైన’ సినిమా అప్డేట్ ఇచ్చిన మేకర్స్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas), నిధి ప్రదీప్(Nidhi Pradeep) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’(Godari Gattupyna).

దిశ, సినిమా: యంగ్ హీరో సుమంత్ ప్రభాస్(Sumanth Prabhas), నిధి ప్రదీప్(Nidhi Pradeep) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గోదారి గట్టుపైన’(Godari Gattupyna). సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో జగపతి బాబు, సీనియర్ హీరోయిన్ భూమిక, రాజీవ్ కనకాల, లైలా, దేవీప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అందమైన భావోద్వేగాలతో గోదావరి జిల్లాలోని వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో ఈ కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ బ్యానర్స్‌పై అభినవ్‌రావు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 25న సాయంత్రం 5:07 గంటలకు థియేటర్స్‌లో ‘ఓజీ’కి అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఫస్ట్ బ్రీజ్‌కు రంగం సిద్ధమైంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీతో పాటు రాబోతుంది అని తెలిపారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






