టిక్ టాక్ ఫేమస్ స్టార్ మృతి

by Disha Web Desk 17 |
టిక్ టాక్ ఫేమస్ స్టార్ మృతి
X

దిశ, సినిమా: సోషల్ మీడియా ద్వారా కామన్ పీపుల్ కూడా సెలబ్రిటీలకు సమానంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. చాలామంది సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అయితే టిక్ టాక్ బ్యూటీ మేఘా థాకూర్ (21) ఇలాంటి ఓ స్టార్‌గా ఎదగక ముందే మృతిచెందింది. ఈ విషయాన్ని మేఘా తల్లిదండ్రులు రీసెంట్‌గా తెలిపారు కానీ ఎలా చనిపోయిందనే దానిపై సమాధానమివ్వలేదు.

కాగా మేఘా ఈ ఏడాది జులైలో హార్ట్ ఎటాక్‌కు గురైనట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీన్నిబట్టి ఆమె ఏదో అనారోగ్యం కారణంగా చనిపోయి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇక మేఘాకు టిక్ టాక్‌లో 10 లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా.. ఇన్ స్టా‌లో లక్షమందికి పైగ ఫాలోవర్స్ ఉన్నారు.

READ MORE

మెట్ల మీద నుంచి పడిపోయిన సింగర్.. ఎలా ఉన్నాడంటే..



Next Story