నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. థ్రిల్స్, ట్విస్టుల కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

మలయాళ స్టార్ హీరో ఆసిఫ్(Asif), అపర్ణ బాలమురళి(Aparna Balamurali) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిరాజ్’(Mirage).

నెలరోజులకే ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. థ్రిల్స్, ట్విస్టుల కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో ఆసిఫ్(Asif), అపర్ణ బాలమురళి(Aparna Balamurali) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మిరాజ్’(Mirage). జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రంలో సంపత్ రాజ్, శరవణన్, కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 19న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా కరెక్ట్‌గా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. తాజాగా, ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదలైంది. ‘మిరాజ్’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకోగా.. దీపావళికి ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్ కాబోతుందని వెల్లడించింది. ‘‘మీకు స్టోరీ తెలుసని అనుకుంటారు.. ఓ ట్విస్ట్ ఎదురైతేగానీ తెలియదు. మిరాజ్ ఒక రోజు ముందుగానే అక్టోబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఫుల్ ట్విస్టులు, థ్రిల్స్ అందించే ఆదివారం కోసం సిద్ధంగా ఉండండి” అనే క్యాప్షన్ జత చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story