‘STR-51’లో శింబుతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు క్రేజీ భామలు.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శింబు సరసన ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు నటించబోతున్నారట.

‘STR-51’లో శింబుతో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు క్రేజీ భామలు.. హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శింబు (STR) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో ‘అరసన్’ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ‘అరసన్’ పూర్తికాకముందే శింబు తన తదుపరి చిత్రం (STR 51) గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి.శింబు తన 51వ సినిమాను యువ దర్శకుడు అశ్వత్ వైరముత్తుతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శింబు సరసన ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు నటించబోతున్నారట. ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి ఈ ప్రాజెక్టులో నటించడం ఖాయమైందని సమాచారం. ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్ల కోసం చిత్ర యూనిట్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.

‘సప్త సాగరదాచే ఎల్లో’ ఫేమ్ రుక్మిణి వసంత్ , మృణాల్ ఠాకూర్ లతో మూవీ టీమ్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురు భామలు గనుక ప్రాజెక్టులోకి వస్తే, శింబు సినిమా రేంజ్ మరో లెవల్‌కు వెళ్లడం ఖాయమని అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీరికి తోడుగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారనే వార్త సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. అయితే, ఈ ముగ్గురు హీరోయిన్ల ఎంపికపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శింబు మార్క్ స్టైల్, అశ్వత్ టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్.. ఇవన్నీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story