Prabhas: ‘ది రాజసాబ్’ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలిస్తే వావ్, సూపర్ అనాల్సిందే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-25 05:33:45  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’.

Prabhas: ‘ది రాజసాబ్’ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా ముగ్గురు స్టార్ హీరోలు.. ఎవరో తెలిస్తే వావ్, సూపర్ అనాల్సిందే!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ మూవీని పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్, రిద్ధి కుమార్‌(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 5న క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది. నేడు టీజర్ విడుదలై అంచనాలను రెట్టింపు చేసింది. ఇందులోని కామెడీ సీన్స్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు ప్రభాస్ లుక్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇక ఈ టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.

అయితే ఇందులో ఓ ముగ్గురు స్టార్ హీరోలు ఉండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రభాస్ ఫైట్ చేస్తుండగా.. టీ షాపు వద్ద ఈ ముగ్గురి పోస్టర్లు అతికించి ఉంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ముగ్గురు హీరోల అభిమానులు మాత్రం వావ్ సూపర్ అని అంటున్నారు. కాగా, ‘ది రాజాసాబ్’ మూవీ హారర్, కామెడీ నేపథ్యంలో రాబోతుంది. ఇక ఈ జానర్‌లో ప్రభాస్ మొట్టమొదటిసారిగా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Link

Next Story