- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పైరసీకి సపోర్ట్ చేస్తున్న వారిని అరెస్టు చేయాలి.. ఐబొమ్మ రవి ఇష్యూపై ఆర్జీవీ సెన్సేషనల్ ట్వీట్
గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఐబొమ్మ ఇష్యూకు సంబంధించిన విషయాలే కనిపిస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఐబొమ్మ ఇష్యూకు సంబంధించిన విషయాలే కనిపిస్తున్నాయి. పైరసీ చేస్తున్న వారిపై పోలీసుల చర్యలు వేగవంతం చేశారు. ఎంతోమంది దర్శకనిర్మాతలకు నష్టాలు కలిగించి థియేటర్‌కి వెళ్లలేని వారికి పైరసీ చేసి సినిమాలను ఉచితంగా చూపించిన ఇమ్మడి రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో పలు సంచలన విషయాలు బయటపడుతూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఐబొమ్మ యాప్ ద్వారా సినిమాలను పైరసీని చేసిన రవికి సపోర్ట్‌గా నిలుస్తుంటే.. మరికొందరు తిడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ ఇష్యూపై వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా స్పందించి తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు. ‘‘ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందుతున్నందున రాబిన్ హుడ్ రవి చేస్తున్న పైరసీ ఎప్పటికీ ఆగదు.
అలాంటి సినిమాలు చూడటానికి చాలా మంది ఉన్నంత కాలం వారికి సేవ చేయడానికి రవిలు ఎల్లప్పుడూ ఉంటారు. నాతో సహా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా సమయం ఆదా అవుతుందని పైరసీ కంటెంట్‌ను చూస్తారు. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, తప్పు చేసిన రవిని రాబిన్ హుడ్‌తో పోలుస్తున్నారు. ఆయన హీరో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి ఉగ్రవాది. పైరేటెడ్ కంటెంట్‌ను చూస్తున్న 100 మంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి పేర్లను ప్రచారం చేయండి. అందరూ సినిమా లింక్‌ను చూడటం లేదా ఫార్వార్డ్ చేయడం చేయాలంటే భయపడతారు. సినిమా ఖరీదైనది.. టికెట్ రేట్లు ఎక్కువగా.. ఉన్నాయంటే అప్పుడు పైరసీ సమర్థించవచ్చు. పాప్‌కార్న్ ధర ఎక్కువగా ఉంటే అప్పుడు చిత్రాలను లీక్ చేయండి. అంతేకానీ ఇలా పైరసీ చేయొద్దు. ఈ రకమైన ఆలోచన సామాజిక పతనానికి దారితీస్తుంది. అలా చేయడం చాలా పెద్ద తప్పు’’ అని రాసుకొచ్చారు. అలాగే పైరసీని సపోర్ట్ చేసే వారికి కూడా శిక్ష పడాలని అభిప్రాయపడ్డాడు.






