- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితంలో అవి ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు: ప్రియాంక మోహన్
కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటిగా తనలోని సత్తాను నిరూపించుకునే విభిన్నమైన పాత్రలు చేయడానికే తాను ఇష్టపడతానని ప్రియాంక స్పష్టం చేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక అరుళ్ మోహన్. నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ సుందరి, అటు అందంతోనూ, ఇటు అభినయంతోనూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘మేడ్ ఇన్ కోరియా’ ఓటీటీలో భారీ విజయాన్ని సాధించడంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక తన మనసులోని మాటలను ఒక ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నారు. ప్రియాంక తన విద్యాభ్యాసం గురించి చెబుతూ.. తాను బయో టెక్నాలజీలో డిగ్రీ చేశానని తెలిపారు. అయితే చదువుకుంటున్న సమయంలో కూడా తన మనసంతా సినిమాలపైనే ఉండేదని, తెరపై నటిగా కనిపించాలన్నదే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. చదువు పూర్తవ్వగానే తన కలను నిజం చేసుకునే క్రమంలో ‘ఒంధ్ కథే హెళ్లా’ అనే కన్నడ సినిమాతో నటనలో అడుగు పెట్టారు.
నాని, శర్వానంద్ వంటి హీరోలతో పనిచేయడం ద్వారా తాను నటిగా ఎంతో నేర్చుకున్నానని ప్రియాంక వెల్లడించారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఓజీ’ (OG) సినిమాలో నటించిన క్షణాలు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలని ఆమె ఎమోషనల్ అయ్యారు. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా, నటిగా తనలోని సత్తాను నిరూపించుకునే విభిన్నమైన పాత్రలు చేయడానికే తాను ఇష్టపడతానని ప్రియాంక స్పష్టం చేశారు. "నాకు సవాలు విసిరే పాత్రలంటేనే ఆసక్తి ఎక్కువ. అప్పుడే నటిగా మనల్ని మనం కొత్తగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘మేడ్ ఇన్ కోరియా’ సినిమాలో అలాంటి ఒక అద్భుతమైన పాత్రను పోషించాను. ఆ మూవీ షూటింగ్ నాకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. నటిగా నన్ను నేను కొత్తగా తెలుసుకున్న" అని ప్రియాంక తన సినీ ప్రయాణం గురించి సంతోషంగా చెప్పుకొచ్చారు.






