- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం.. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటూ నివేదా పేతురాజ్ షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతోంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్(Nivetha Pethuraj) బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతోంది. త్వరలోనే తన ప్రియుడు రజిత్ ఇబ్రాన్(Rajhit Ibran)ను పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించి అందరికీ షాకిచ్చింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘మేము ఇటీవల చేసిన పోస్ట్ ఇంతగా సెన్సేషనల్ అవుతుందని ఊహించలేదు. అది సడెన్‌గా తీసుకున్న నిర్ణయం. మంచి రోజు కాబట్టి ఆ రోజే మా ప్రేమ విషయాన్ని ప్రకటించాలని అనుకున్నాము. మా బంధం శాశ్వతంగా ఉంటుందని భావిస్తున్నాము. నా ప్రేమ గురించి ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. అందరికీ ఇది షాకింగ్ విషయం. మేమిద్దరం అక్డోబర్‌లో నిశ్చితార్శం చేసుకోవాలనుకుంటున్నాము.
2026 జనవరిలో వివాహం చేసుకుంటాము. కానీ తేదీ ఇంకా ఖరారు కాలేదు. నేను ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. నాకు వస్తున్న పాత్రలతో నేను అంత సంతోషంగా లేదు. నాకు వచ్చే క్యారెక్టర్స్ బోరింగ్‌గా అనిపిస్తున్నాయని న్యాయం చేయలేను కావచ్చని అనుకున్నాను. ఈ సమయంలోనే రజిత్ నువ్వు సినిమాల్లో నటించాలని ప్రోత్సహించాడు. ఈక్రమంలోనే ఓ ఆఫర్ వచ్చింది. దీంతో వెంటనే షూటింగ్‌కు వెళ్లాను. అది నాకు సరైనదని నేను గ్రహించాను. సెట్‌లో ఉండటాన్ని నేను చాలా మిస్ అయ్యాను. రజిత్ నా తండ్రిలాగే నా పట్ల ప్రేమను కురిపిస్తాడు. అతను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కానప్పటికీ.. నా కుటుంబాన్ని నన్ను చాలా గౌరవిస్తాడు. అయితే నా జీవితంలో సినిమాలు ఒక భాగం మాత్రమే.. అదే నా లైఫ్ కాదు’’ అని చెప్పుకొచ్చింది.






