- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదే నాకు దక్కిన గొప్ప అవకాశం.. చాలా బాధగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్న బిగ్‌బీ
ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(Kaun Banega Crorepati)తో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)కు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనంత గాఢమైనది.

దిశ, సినిమా: ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(Kaun Banega Crorepati)తో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)కు ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనంత గాఢమైనది. ఈ షో కేవలం గేమ్ షోగా మాత్రమే కాకుండా.. కోట్లాది మంది జీవితాలకు ప్రేరణగా నిలిచింది. సామాన్య వ్యక్తులు తమ కలలను నిజం చేసుకునే వేదికగా మారిన ఈ కార్యక్రమానికి బిగ్‌బీ హోస్టింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రశ్నలు అడిగే తీరు, పోటీదారులకు ఇచ్చే ధైర్యం ప్రేక్షకులను కట్టిపడేసింది. 17వ సీజన్ కొనసాగుతుండగా.. ఫైనల్ ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ షోతో కలిసి ప్రయాణిస్తూ.. వేలాది కుటుంబాల కథలను, కష్టాలను, విజయాలను ఆయన ప్రత్యక్షంగా చూశారు. కొందరి కన్నీళ్లు తుడిచారు.. మరికొందరి చిరునవ్వులకు కారణమయ్యారు. అందుకే ఈ చివరి ఎపిసోడ్‌లో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.‘‘కొన్నిసార్లు మన జీవితంలోని కొన్ని క్షణాలను ఎంత గాఢంగా ఆస్వాదిస్తాం. ఆ క్షణాలు ముగింపుకు చేరుకుంటే.. ఇప్పుడే కదా మొదలైంది అని బాధపడతాం.
ప్రతీది నిన్నే జరిగినట్లుగా అనిపిస్తుంటుంది. ఈరోజు నాకూడా అలాగే ఉంది. చివరి ఎపిసోడ్ నా మనసంతా అదోలా ఉంది. నా జీవితంలో మూడింట ఒక వంతు.. కాదు అంతకన్నా ఎక్కువ ఈ షోలో మీ అందరితో గడిపాను. అదే నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడు వచ్చినా మీ అందరూ సాదరంగా ఆహ్వానం పలికారు. నేను నవ్వితే నాతోపాటే నవ్వారు. నా కళ్లలో నీళ్లు తిరిగితే మీరు కూడా ఏడ్చారు. ఈ ప్రయాణం మొదలైన దగ్గరి నుంచి చివరి వరకు నాకు తోడుగా ఉన్నారు. మీరు ఇలా తోడుగా ఉన్నంతవరకు ఈ గేమ్ షో ఇలానే కొనసాగుతుంది. మీ ప్రేమ, మద్దతులు నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా బాధగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ షో 18వ సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.






