- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చింది.. జయం రవి ఎమోషనల్ కామెంట్స్(వీడియో)
కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్(Siddharth) వరుస చిత్రాల్లో నటిస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్(Siddharth) వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సిద్దార్థ్, శ్రీ గణేష్ కాంబినేషన్‌లో ‘3BHK’ మూవీ రాబోతుంది. ఆర్. శరత్‌కుమార్(Sharathkumar), దేవయాని, యోగి బాబు(Yogi Babu), మీటా రఘునాథ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఇక ఈ వెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి(Jayam Ravi) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను నా జీవితంలో ఎప్పుడూ అద్దె ఇంట్లో నివసించలేదు. కానీ ఇప్పుడు నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. 3BHK నుండి నేను చాలా విషయాలను చెప్పగలను. ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చింది. నా జీవితంలోని మిగిలిన భాగాన్ని సంతోషంగా గడపబోతున్నాను’’ అని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, జయం రవి గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ఆయన భార్యకు విడాకులు ఇవ్వబోతున్న ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే ఒకరిపై ఒకరు పలు పోస్టులు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో కోర్టు వారిని హెచ్చరించింది. ఇక ఆయన భార్య ఆర్తి మాత్రం నెలకు 40 లక్షల భరణం డిమాండ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈక్రమంలోనే జయంరవి ప్రముఖ సింగర్ కెనిషాతో క్లోజ్‌గా కనిపించారు. దీంతో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిపై ఈ జంట స్పందించి తాము కేవలం ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ డేటింగ్ పుకార్లు మాత్రం ఆగడం లేదు.






