- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట్లు తెచ్చిన సినిమాను ఫ్లాప్ అని ఎలా అంటారు.. ‘కింగ్‌డమ్’ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (vijay dewarakonda), భాగ్యశ్రీ బోర్సే (bagya shri borse) కాంబోలో వచ్చిన మూవీ ‘కింగ్‌డమ్’(kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ(nagavamsi) ఈ చిత్రం వల్ల తనకు నష్టాలు రాలేదని వెల్లడించారు. ‘‘నా దృష్టిలో ‘కింగ్‌డమ్’ ఫ్లాప్ కాదు. అది విడుదలైనప్పుడు ఎందుకలా ప్రచారం చేశారో అర్థం కాలేదు. అమెరికాలో రూ. 28కోట్లు, నైజాంలో రూ. 12 కోట్లు వచ్చిన మూవీని ఫ్లాప్ అని ఎలా అంటారు. ఈ సినిమా నాకు ఎలాంటి నష్టాలు తీసుకురాలేదు. నా నుంచి కొన్న బయ్యర్లు కూడా సేఫ్. ఒక్కరిద్దరికి నష్టాలు వస్తే.. రిటర్న్ ఇచ్చాం. దీంతో అందరూ సేఫ్ జోన్‌లోకి వచ్చారు. నష్టాలు రానప్పుడు ఫ్లాప్ ఎలా అవుతుంది. అన్ని రకాలుగా ‘కింగ్‌డమ్’ మంచి హిట్ జోన్‌లనే ఉంది’’ అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ప్లాప్ సినిమాను హిట్ అంటున్నాడని ట్రోల్ చేస్తున్నారు.






