ఈ ప్రయాణం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది.. ‘IM GAME’ అప్డేట్ ఇస్తూ దుల్కర్ సల్మాన్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-16 09:27:09  IST  )

షూటింగ్ ముగింపు రోజు నా ముఖంలో ఉన్న చిరునవ్వులే అన్నీ చెప్పేస్తున్నాయి. ‘ఐయామ్ గేమ్’ షూట్ విజయవంతంగా పూర్తయింది.

ఈ ప్రయాణం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది.. ‘IM GAME’ అప్డేట్ ఇస్తూ దుల్కర్ సల్మాన్ పోస్ట్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్, టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరో దుల్కర్ సల్మాన్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ‘ఐయామ్ గేమ్’ ఒకటి. ఆర్డీఎక్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన దర్శకుడు నహాస్ హిదాయత్ ఈ సినిమాను రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో మైలురాయి లాంటి 40వ చిత్రంగా ‘ఐయామ్ గేమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను దుల్కర్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వేఫురర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో దుల్కర్ సరసన కయ్యదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షూటింగ్ ఆఖరి రోజున చిత్ర యూనిట్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

"షూటింగ్ ముగింపు రోజు నా ముఖంలో ఉన్న చిరునవ్వులే అన్నీ చెప్పేస్తున్నాయి. ‘ఐయామ్ గేమ్’ షూట్ విజయవంతంగా పూర్తయింది. ఈ ప్రయాణం నాకు ఎంతో తృప్తిని ఇచ్చింది. ఆగస్టు 20న థియేటర్లలో మిమ్మల్ని కలుస్తాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. పూర్తిస్థాయి క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక క్రికెటర్ జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, మైదానంలో జరిగే పోరాటాలు, వ్యక్తిగత భావోద్వేగాల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. క్రికెట్, యాక్షన్ కలయిక అంటే దుల్కర్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. కాగా.. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మలయాళీల పెద్ద పండుగ అయిన ఓనం సందర్భంగా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Next Story