- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదే నా జీవితానికి నిజమైన ఆనందం అంటూ నిహారిక స్పెషల్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
మెగా డాటర్ నిహారిక(Niharika) సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస హిట్లతో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది.

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(Niharika) సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస హిట్లతో దూసుకుపోతుంది. హీరోయిన్‌గా చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా మారి సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు తెరకెక్కిస్తూ సక్సెస్‌ఫుల్ నిర్మాత అనిపించుకుంటుంది. అంతేకాకుండా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డును సైతం అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. నిహారిక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్(Sangeeth Shobhan) హీరోగా.. ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఓ వైపు సినిమాలు తెరకెక్కిస్తూనే పర్సనల్ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది.
షూటింగ్స్, సినిమాలకు విరామం దొరికినప్పుడు నిహారిక తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మెగా డాటర్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా, నిహారిక పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈశాన్య భారతదేశంలోని మేఘాలయాలో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నా నిహారిక అక్కడి సన్‌సెట్‌ను ఆస్వాదించింది. ‘‘సన్‌సెట్‌ను వెంటాడుతూ నా హృదయానికి ఆనందాన్ని కలిగిస్తున్నాను. ఇదే నా జీవితానికి నిజమైన ఆనందమంటూ నవ్వుతున్న ఫొటోలను షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా బాగున్నావ్ అక్క అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Read More..
పెళ్లి చేసుకోకుండా ఉండగలను.. కానీ ఆ పనిచేయకుండా బతకలేనంటూ టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్!






