నా కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్ర: అదితి రావు హైదరీ

by Mallepaka Hamsa |

అదితి రావ్ హైదరీ(Aditi Rao Hydari) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

నా కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్ర: అదితి రావు హైదరీ
X

దిశ, సినిమా: అదితి రావ్ హైదరీ(Aditi Rao Hydari) మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ‘రాక్‌స్టార్’ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన ఆమె, ఇప్పుడు ఇమ్తియాజ్ అలీ క్రియేట్ చేసిన ‘ఓ సాథీ రే’(O Saathi Re) ద్వారా ఆయనతో కలిసి పని చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో వస్తున్న ఈ పీరియాడికల్ లవ్ స్టోరీపై అదితి స్పందిస్తూ.. ఇమ్తియాజ్ అలీతో పనిచేయాలనే తన చిరకాల కోరిక ఈ సినిమాతో నెరవేరిందని వెల్లడించింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఇమ్తియాజ్ అలీ(Imtiaz Ali) పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని అదితి పేర్కొంది. ‘‘ఇమ్తియాజ్ మానిటర్ వైపు కూడా చూడరు, నేరుగా నటుల వైపు చూస్తూ సీన్ ఎలా వస్తుందో గమనిస్తారు. ఆయన ఎనర్జీ, అప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేసే తీరు నటిగా నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది’’ అని తెలిపింది.

'ఓ సాథీ రే' భావోద్వేగపరంగా చాలా లోతైన కథ అని, తన కెరీర్‌లో ఇది అత్యంత సవాలుతో కూడిన పాత్ర అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి క్లిష్టమైన పాత్రలు చేయడమే ఒక నటిగా తనకు గొప్ప సంతృప్తిని ఇస్తుందని అదితి స్పష్టం చేసింది. ఇక ఈ సినిమాలో తన కో-స్టార్స్ గురించి కూడా అదితి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'గర్ల్ ఆన్ ఏ ట్రైన్' తర్వాత మళ్ళీ అవినాష్ తివారీతో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయన ఒక మంచి స్నేహితుడని తెలిపింది. అలాగే అర్జున్ రాంపాల్‌ను యూనివర్సల్ క్రష్‌గా చెప్తూ ఆయన సెట్స్‌లో చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటారని ప్రశంసించింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు పంకజ్ త్రిపాఠితో కలిసి ‘పారివారిక్ మనోరంజన్’ అనే చిత్రంలోనూ, అలాగే ఒక సౌత్ థ్రిల్లర్ మూవీలోనూ తాను నటిస్తున్నట్లు అదితి అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అదివి రావు కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story