- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘చంద్రముఖి-2’ ఫస్ట్ రివ్యూ ఇదే.. లారెన్స్ రజినీకాంత్‌లా హిట్ కొట్టేనా?
సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి’. ఈ సినిమా 2005లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార కలిసి నటించిన చిత్రం ‘చంద్రముఖి’. ఈ సినిమా 2005లో విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి-2 వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో హీరోగా రాఘవ లారెన్స్, నటించగా జ్యోతిక క్యారెక్టర్‌లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రానౌత్ నటించింది. ఒరిజినల్ తెరకెక్కించిన సీనియర్ దర్శకుడు పి. వాసు తెరకెక్కించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
తాజాగా, ‘చంద్రముఖి-2’ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు సినిమాపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దర్శకుడు పి. వాసు స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ అయిందని ఆయన కథను నడిపించిన తీరు ఆకట్టుకుందని అంటున్నారు. హీరో రాఘవ లారెన్స్ రెండు భిన్నమైన పాత్రలో మెప్పించాడు. రజినీకాంత్ తో పోల్చుకుంటే లారెన్స్ నటన అంతగా ఆకట్టుకోనట్లు తెలుస్తోంది. ఇక చంద్రముఖిగా కంగనా రనౌత్ కి ఆడియన్స్ పాస్ మార్క్స్ వేస్తున్నారు. అప్పట్లో జ్యోతిక ప్రేక్షకులను మామూలుగా బయపెట్టలేదట. సినిమా చూసిన జనాలు నిద్రలో కేకలు వేశారు. ఆ స్థాయిలో కంగనా భయపెట్టలేకపోయింది. చంద్రముఖి 2 చిత్రానికి కీరవాణి మ్యూజిక్ బలం చేకూర్చింది అంటున్నారు. మొత్తానికి చంద్రముఖి-2 పాజిటివ్ టాక్‌ను మాత్రమే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రేపు సినిమా థియేటర్స్‌లో విడుదలయ్యాక లారెన్స్, రజినీకాంత్‌లా హిట్ కొడతాడో లేదో చూడాలి మరి.






